తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో జరిగిన ర్యాగింగ్ ఘటనలో సైకాలజీ విభాగాధిపతి విశ్వనాథ రెడ్డి ప్రవర్తనను సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండించింది. ర్యాగింగ్ చట్టరీత్యా నేరం అయినప్పటికీ, విభాగాధిపతి దానిని ప్రోత్సహించడం దారుణమని నగర కార్యదర్శి పి. వెంకటరత్నం మంగళవారం తిరుపతిలో పేర్కొన్నారు. బాధిత విద్యార్థినులు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఆందోళనకరమని, విశ్వనాథ రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.