హైదరాబాద్‌కు చెందిన భక్తుడు జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారికి సుమారు రూ. 30 లక్షల విలువైన 22 కిలోల వెండి గంగాళాన్ని విరాళంగా సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ అధికారులకు ఈ విలువైన కానుకను అందజేశారు. భక్తితో చేసిన ఈ విరాళాన్ని అధికారులు స్వీకరించి, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.