తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో బుధవారం రాత్రి కార్తీకపౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా, సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరేవారు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్