తిరుమలలోని ఆర్బిసి సెంటర్ లో నివసిస్తున్న 84 మందిని తిరుపతికి తరలించే ప్రయత్నాన్ని విరమించుకుని, వారికి బాలాజీ నగర్ లో నివాసం కల్పించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టిటిడి ఈఓ ఏకే సింఘాల్ ను కోరారు. మంగళవారం టిటిడి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో జరిగిన సమావేశంలో, ఆర్బిసి సెంటర్ నిర్వాసితులకు తిరుమలలోనే నివాసం కల్పించడం సముచితమని ఆయన అన్నారు.