తిరుమలలో వైభవంగా శ్రీవారి పుష్పయాగం

కార్తీకమాస శ్రవణ నక్షత్రం సందర్భంగా గురువారం తిరుమల శ్రీవారికి పుష్పయాగం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా అర్చకులు సువర్ణ అలంకారాలతో మంగళమూర్తిగా తీర్చిదిద్దారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య పుష్పార్చన నిర్వహించారు. ఈ యాగంలో సువాసనలు వెదజల్లే 16రకాల పుష్పాలు, 6రకాల పత్రాలు వినియోగించారు. భక్తుల కోలాహలం మధ్య ఆలయం పుష్ప సుగంధాలతో పరిమళభరితంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్