తిరుపతి స్విమ్స్‌లో యాంటీ ర్యాగింగ్ వారోత్సవాల సందర్భంగా శనివారం అవగాహన కార్యక్రమం జరిగింది. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత విద్యార్థులకు ర్యాగింగ్‌పై చట్టపరమైన అంశాలు, దానివల్ల కలిగే నష్టం, భవిష్యత్తుపై ప్రభావం గురించి వివరించారు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం తీవ్ర నేరమని హెచ్చరిస్తూ, విద్యాసంస్థల్లో సానుకూల వాతావరణం కోసం ప్రతి విద్యార్థి బాధ్యత వహించాలని సూచించారు.