కిసాన్ యోజన పేరుతో వచ్చిన ఫైల్ ని ఓపెన్ చేయడంతో మొబైల్ హ్యాక్ అయ్యింది. దీంతో కొత్తపల్లికి చెందిన మునిస్వామి అనే ప్రైవేటు ఉద్యోగి రూ.10.45 లక్షలు కోల్పోయాడు. అతడు తిరుపతిలో ఓ గోల్డ్ షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. తన ఖాతాలో నుంచి డబ్బు మాయమవ్వడంతో తిరుపతి వెస్ట్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు.