తిరుపతి: కార్తీక పౌర్ణమి సందర్బంగా ఆలయాలవద్ద భద్రతా ఏర్పాట్లు

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. క్యూ లైన్ నిర్వహణ, వచ్చి వెళ్లే మార్గాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, దర్శనం వంటి అంశాలపై ఆలయ కమిటీలతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేశారు. భక్తులు సౌకర్యంగా దర్శనం పూర్తి చేసుకునేందుకు ప్రత్యేక బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కట్టారు.

సంబంధిత పోస్ట్