మంగళవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. గోశాల నిర్వహణ, గోవులకు దాణా, వసతి, వైద్యం, తాగునీరు, పరిశుభ్రత వంటి అంశాలను ఇంఛార్జీ డైరెక్టర్ డి. పణికుమార్ నాయుడు వివరించారు. దాదాపు 500 గోవులకు ఆధునిక వసతులతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనాన్ని, గోశాలలో గోవులు, దూడలు ఉంటున్న షెడ్లను ఈవో పరిశీలించారు. పశువుల సంఖ్య, దాణా మిక్సింగ్ ప్లాంటు, అగరబత్తిల యూనిట్ వంటి కార్యాకలాపాలను కూడా ఆయన పరిశీలించారు.