తిరుపతి కలెక్టరేట్ వద్ద కలకలం;మహిళ ఆత్మహత్యాయత్నం

తిరుపతి నగరంలోని కొర్లగుంటకు చెందిన బండి వెంకట సుబ్బమ్మ, తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా టీడీపీ నాయకుడి అండతో కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ, సోమవారం జిల్లా కలెక్టరేట్ గేటు వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అధికారుల స్పందన లేకపోవడంతో నిరాశ చెంది ఈ చర్యకు పాల్పడినట్లు ఆమె తెలిపింది. కలెక్టర్ ఆదేశాల మేరకు సీఐ సునీల్‌కుమార్ విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్