జెమ్స్ పాఠశాల విద్యార్థుల అద్భుత విజయం: మండల సైన్స్ పోటీల్లో ప్రథమ స్థానం

రాపూరు మండలం, నెల్లూరు జిల్లాలో 04 నవంబర్ 2025న జరిగిన చెకుముకి సైన్స్ సంబరాల మండల స్థాయి పోటీల్లో జెమ్స్ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి, ప్రథమ స్థానాన్ని సాధించారు. ఈ విజయంతో వారు జిల్లా స్థాయి పోటీలకు అర్హత పొందారు. S. గీతిక, S. జ్యోషిత, M. కీర్తన విజేతలుగా నిలిచారు. జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ మునీంద్రా రెడ్డి విద్యార్థులను అభినందిస్తూ, జిల్లా స్థాయిలో కూడా అద్భుత ప్రతిభ కనబరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, సహ విద్యార్థులు విజేతలను అభినందించారు.

సంబంధిత పోస్ట్