తిరుపతి జిల్లా స్త్రీనిధి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్, గురువారం వెంకటగిరి వెలుగు కార్యాలయంలో ఏపీఎం శైలజతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఒక పొదుపు సంఘానికి రూ. 8లక్షల స్త్రీనిధి రుణం మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మండలంలో పెండింగ్‌లో ఉన్న మొండి బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మురళీకృష్ణ, సీసీలు పాల్గొన్నారు.