వెంకటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) 9, 10వ తరగతి విద్యార్థులకు సమగ్ర శిక్ష ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వృత్తివిద్య నైపుణ్య పోటీల్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ విభాగాలలో పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎమ్. శశికళ మాట్లాడుతూ, ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో వృత్తివిద్య పట్ల ఆసక్తిని పెంచి, ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయని తెలిపారు. వృత్తివిద్యా అధ్యాపకులు శివకుమార్, హరీష్ విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధికి శిక్షణ ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.