AP: గుంటూరు జిల్లాలో కలరా కలకలం రేపుతోంది. తాజాగా నాలుగు కలరా కేసులు బయటపడ్డాయి. గత ఐదు రోజులుగా వాంతులు విరేచనాలతో బాధపడుతూ 146 మంది డయేరియా బారినపడ్డారు. 114 నమూనాలను సేకరించి ల్యాబ్‌కు టెస్టులకు పంపించారు. 91 రక్త పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ముగ్గురికి విబ్రియో కలరే బ్యాక్టీరియా, 16 మందిలో ఈ-కోలి బ్యాక్టీరియా, ఒకరిలో షిగెల్లా బ్యాక్టీరి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.