AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ, అప్పటి పులివెందుల సీఐ జె.శంకరయ్య సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. ఈ నెల 18న న్యాయవాది జి.ధరణేశ్వరరెడ్డి ద్వారా పంపిన ఈ నోటీసుల్లో, అసెంబ్లీలో బహిరంగ క్షమాపణలు చెప్పాలని, రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య డిమాండ్ చేశారు. ఈ నోటీసులు మంగళవారం వెలుగులోకి వచ్చాయి.