AP: అనంతపురం జిల్లా, తాడిపత్రిలోని వెంగన్నపల్లిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ నేతలపై జేసీ వర్గీయులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో వైసీపీ కార్యకర్తలు లక్ష్మినాథ్, వెంకటలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడిని ఖండించి, గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.