AP: తిరుపతి జిల్లా కొర్లగుంటలోని సుభాష్ నగర్‌లో అర్ధరాత్రి కొందరు యువకులు ఘర్షణకు దిగారు. అశోక్ అనే వ్యక్తి ముగ్గురు యువకులపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో చందు (25) అనే యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి బలమైన కత్తిపోటు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.