AP: విశాఖలోని అన్నదాన కార్యక్రమంలో గంజిపడి చిన్నారులు గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులను ఆస్పత్రికి తరలించగా, ఆరుగురు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. స్వల్ప గాయాలైన ఇతరులను డిశ్చార్జ్ చేశామని, బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్ వెల్లడించారు.