AP: పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి శాంతిభద్రతల సమస్య సృష్టించడంపై సీఎం సీరియస్ అయ్యారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేస్తారా? అని చంద్రబాబు మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. జగన్ పొదిలి పర్యటన సందర్భంగా బుధవారం టీడిపీ-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగి పలువురికి గాయాలయ్యాయి.