AP: రాష్ట్రవ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి, ఎమ్మెల్సీలు మండలికి రారు. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టి అనేక సమస్యలు పరిష్కరించాం. భవిష్యత్తులో ప్రజలపై రూ.1000 కోట్ల భారం తగ్గిస్తున్నాం. పార్టీలో అందరూ ప్రజలకు దగ్గరగా ఉండాలి’ అని ప్రజాప్రతినిధులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు సూచించారు.