నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉ.10.15 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి మ.12.50 గంటలకు చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా నవంబర్ 14, 15 తేదీల్లో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో కలిసి విశాఖలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తారు. సాయంత్రం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అలాగే కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి.. రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు.

సంబంధిత పోస్ట్