AP: వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విజయనగరం జిల్లా దత్తిలో ఆయన మాట్లాడుతూ, "నేను 1995 నాటి సీఎంను. సహకరిస్తే సరే, లేదంటే ఏం చేయాలో చేసి చూపిస్తా" అని హెచ్చరించారు. ఫేక్ ప్రచారాలతో ప్రభుత్వంపై బురద చల్లొద్దని మండిపడ్డారు. ఆడబిడ్డల రక్షణ, శాంతిభద్రతలే తమ లక్ష్యమన్నారు. ఎవరికైనా గంజాయి మత్తు ఉంటే దింపేస్తామని, శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూసినా, వారందరికీ ఖబడ్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.