AP: ప్రజల ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గురువారం ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తురకపాలెంలో మూడు నెలల్లో ముప్పై మంది చనిపోవడం బాధాకరమని, వరుస మరణాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగానే ఇక్కడకు వచ్చినట్లు వెల్లడించారు.