AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధితో మరణించిన 28 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించనుంది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. మృతుల్లో ఎక్కువ మంది పేదలున్నారని, వారిని ఆదుకోవాలని పెమ్మసాని కోరారు. ఇవాళ పెమ్మసాని స్వయంగా పరిహారం చెక్కులను పంపిణీ చేయనున్నారు.