టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడుపై ఫిర్యాదు

AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో వైసీపీ యువజన విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ నాయుడుపై తక్షణమే కేసు నమోదు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్