AP: చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల తరహాలోనే ఆయన నిర్వహించిన సూపర్ సిక్స్ సక్సెస్ సభ కూడా సూపర్ ప్లాప్ అయిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అదే సమయంలో వైసీపీ రైతుల కోసం చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైందని స్పష్టం చేశారు. రైతులకు కనీసం యూరియా కూడా సరఫరా చేయలని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. వ్యవసాయశాఖ మంత్రికి దమ్ముంటే మీడియా సాక్షిగా క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్దమా అని సవాల్ విసిరారు.