ఏపీ శాసన మండలిలో కాఫీపై వివాదం చోటు చేసుకుంది. మండలిలో ఇచ్చే కాఫీకి, శాసనసభలో ఇచ్చే కాఫీకి తేడా ఉంటోందని మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. రెండు చోట్ల ఒకే రకమైన కాఫీ, భోజనాలు లేవంటూ వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. అయితే కాఫీ, భోజనాలలో ఎక్కడా తేడా లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఇచ్చారు. ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగే పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.