ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం అంటూ ప్రజలను భయపెడుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మద్యం మరణాలపై విచారణకు ఆదేశించిన ఆయన, రాజకీయ కుట్రలతో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ మద్యం విషయంలో ఉపేక్షించే ప్రసక్తే లేదని, ప్రజల ప్రాణాలకు హాని చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం తేల్చి చెప్పారు.