ఏపీ మద్యం స్కామ్ కేసుకు సంబంధించి సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లపై కోర్టు అభ్యంతరాలు తెలిపింది. 20కి పైగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు 3 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశించింది. ఇప్పటివరకు రెండు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిన సిట్, జూన్ 19న ప్రైమరీ ఛార్జ్‌షీట్, ఈనెల 11న అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు నిందితులను అరెస్ట్ చేశారు.