AP: మొంథా తుఫాను కారణంగా దాదాపు 13,000 విద్యుత్ స్తంభాలు, 3,000 కి.మీ. కండక్టర్ లైన్లు, 3,000 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని ఇంధన శాఖ మంత్రి జి. రవికుమార్ శుక్రవారం తెలిపారు. తుఫాను సమయంలో సిబ్బందిని సమీకరించి, ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నామని, వ్యవసాయ, ఆక్వాకల్చర్ ఫీడర్లకు 48 గంటల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని అన్నారు.