AP: 'మొంథా' తుఫాన్ సహాయక చర్యల్లో డ్రోన్ టెక్నాలజీ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది. బాపట్ల జిల్లాలోని పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు డ్రోన్‌ను ఉపయోగించారు. వాగు మధ్యలో ఉన్న మున్నా జాడను డ్రోన్ గుర్తించగా, వెంటనే సహాయక బృందాలు అతడిని సురక్షితంగా కాపాడాయి. అలాగే పలు చోట్ల కొట్టుకుపోతున్న పశువులను కూడా డ్రోన్ల సాయంతో గుర్తించి ఒడ్డుకు చేర్చారు.