ఏపీలో రోజూవారీ పని గంటలు పెంపు

AP: రాష్ట్రంలో రోజూవారీ పని గంటలు పెంచే సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. షాపులు, కంపెనీలు, ఫ్యాక్టరీల్లో ప్రస్తుతం రోజుకు 8 పని గంటలు ఉండగా.. దానిని పది పని గంటలకు పెంచారు. అయితే వారానికి 48 పని గంటల్లో మార్పు లేదు. ఫ్యాక్టరీల్లో బ్రేక్ టైమ్‌తో కలిపి 12 గంటలు మించకూడదు. ప్రతి ఆరు పని గంటలకు రెస్ట్ ఇవ్వాలి. మహిళల నైట్ షిఫ్ట్ (రాత్రి 7/8.30- ఉదయం 6గం.)కు అనుమతి ఉంటుంది. సంస్థ వారికి ట్రావెల్ సదుపాయం, సెక్యూరిటీ కల్పించాలి.

సంబంధిత పోస్ట్