బావిలో డెడ్ బాడీ కలకలం

AP: శ్రీకాకుళం జిల్లా, టెక్కలి అక్కపువీధిలోని నూతిలో డెడ్ బాడీ కలకలం రేపింది. ఇదే కాలనీకి చెందిన శ్రీనివాసరావు (40) శుక్రవారం నుంచి కనిపించడం లేదు. కుటుంబికులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఇంటికి సమీపంలోని బావిలో మృతదేహాన్ని చూసిన స్థానికులు బయటకు తీశారు. విషయం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్