AP: ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఈ క్రాప్ నమోదు గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా సాగుతోంది. ఇప్పటికీ ఈ క్రాప్ వివరాలు నమోదు చేసుకోని.. రైతులు వేగంగా వివరాలు నమోదు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు కోరారు. పంటల బీమాతో పాటుగా, ఇన్‌ఫుట్ సబ్సిడీ, రైతులు పండించిన పంట కొనుగోలుకు ఈ క్రాప్ తప్పనిసరి. పంట నష్టపోయిన రైతులకు 'పంట బీమా' పథకం అండగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా కొంత మొత్తం నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుంది.