అవనిగడ్డ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం (వీడియో)

AP: తుఫాన్ నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా నదిపై హైలెవెల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలు అనుసంధానం అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సాస్కీ పథకం నిధుల మంజూరుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో అవనిగడ్డ పరిధిలో అవుట్ ఫాల్ స్లూయిజ్‌ల పునరుద్ధరణ జరుగుతుందని, నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్