గుంటూరులో డయేరియా కలకలం.. ఆస్పత్రిలో 30 మంది చేరిక

AP: గుంటూరులో వాంతులు, విరోచనాలతో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పాత గుంటూరు, ఆర్టీసీ కాలనీ, రెడ్లబజార్, బుచ్చయ్య తోట, నల్లచెరువు, రెడ్డిపాలెం ప్రాంతాల నుండి బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. డయేరియా లక్షణాలతో 30 మందికి పైగా జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వార్డులో బాధితులను ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మూడు రోజులుగా బాధితులు జీజీహెచ్‌కు వస్తున్నారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఇద్దరికి తీవ్ర అస్వస్థతగా ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్