డ్వాక్రా మహిళలకు వెదురు మొక్కల పంపిణీ

AP: డ్వాక్రా మహిళల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వారితో వెదురు సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది రాష్ట్రంలో 10 వేల మంది మహిళలను ఆ దిశగా ప్రోత్సహించనుంది. అధికారులు ఇప్పటికే 2 వేల మందిని ఎంపిక చేశారు. ఈ నెలాఖరు నాటికి మరో 5 వేల మందిని ఎంపిక చేసి వచ్చే నెల నుంచి సాగు మొదలు పెట్టాలని కసరత్తు చేస్తున్నారు. తొలి దశలో అల్లూరి, విజయనగరం, అనకాపల్లి, నంద్యాల, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాగు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్