ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాజీ మంత్రి జోగి రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. "ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. చంద్రబాబు, నారా లోకేశ్‌లను ప్రశ్నించగానే నాపే దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు తిరుమల, విజయవాడ రాలేమని అంటే నేనే మీ ఇంటికి వస్తా. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బాహ్య ప్రపంచానికి చూపించాను. కల్తీ మద్యం కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశా. నార్కో అనాలసిస్ టెస్టుకు కూడా నేను సిద్ధమే" అని జోగి రమేశ్ స్పష్టం చేశారు.