AP: దీపావళి కానుకగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.7,000 జమ కానున్నట్లు సమాచారం. కేంద్రం నుంచి పీఎం కిసాన్ 21వ విడత నిధులు రూ.2 వేలు ఈ నెల 18న లేదా చివరి వారంలో విడుదల కానున్నాయి. దీనికి అదనంగా, రాష్ట్ర కూటమి సర్కార్ తరఫున 'అన్నదాత సుఖీభవ' నిధులు రూ.5 వేలు కలిపి రూ.7 వేలు కూడా ఈ నెలలోనే జమ చేస్తామని ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీంతో, రైతుల ఖాతాల్లోకి త్వరలో మొత్తం రూ.7,000 చొప్పున జమ కానున్నాయి.