ఏపీలో కొత్త స్ట్రీట్‌ వెండింగ్‌ లైసెన్స్‌లు ఇవ్వద్దు: హైకోర్టు

AP: విశాఖ జైలు రోడ్డు, బెసెంట్‌ రోడ్డులో ఆక్రమణలపై దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రోడ్లను వెండర్స్‌ అక్రమిస్తే ఎమర్జెన్సీ వాహనాలు ఎలా వెళ్తాయని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్ట్రీట్‌ వెండింగ్‌ లైసెన్స్‌లు ఇవ్వద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఎలా చర్యలు తీసుకుంటారో తెలపాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాగా, ఏపీ ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చేందుకు 4 వారాల సమయం కోరింది.

సంబంధిత పోస్ట్