ట్రాక్టర్‌ నడుపుతుండగా మూర్ఛ.. డ్రైవర్‌ మృతి

AP: అల్లూరి జిల్లాలోని నిమ్మపాలెం గ్రామంలో విషాద ఘటన జరిగింది. ట్రాక్టర్‌ నడుపుతున్న యువకుడు ఫిట్స్‌తో కింద పడి మృతి చెందాడు. సింహాచలం (21) తన సొంత పొలంలో దుక్కి దున్నడం కోసం చిన్నాన్న కృష్ణారావు వద్దకు వెళ్లాడు. కృష్ణారావు ఇంటి నుంచి ట్రాక్టర్‌ నడుపుకొంటూ వస్తుండగా కొయ్యూరు శివారుకు వచ్చేసరికి సింహాచలంకు ఫిట్స్‌ వచ్చింది. దీంతో ట్రాక్టర్‌ నుంచి కింద పడి మృతిచెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్