టెంపుల్ సిటీ తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాలపై డ్రోన్ సర్వైలెన్స్ జరుగుతోంది. ఈ క్రమంలో డ్రోన్ ద్వారా ఇద్దరు యువకులు మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి మత్తు ఇంజెక్షన్లు, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదైంది. యువత మత్తు పదార్థాల మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.