ఈ నెల 22 నుంచి దసరా సెలవులు: లోకేశ్

AP: దసరా సెలవులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఉన్నాయి. తాజా నిర్ణయంతో అదనంగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.

సంబంధిత పోస్ట్