రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదివారం రాజమండ్రిలోని ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్‌లో జరిగిన 'కార్డియాక్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ గుండెపై ఒత్తిడి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.