జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం అల్లవరం మండలంలోని గూడాలలో పొల్లేటి సాయి మండవ ఇల్లు, ముక్తేశ్వరంలో దొరబాబుకు చెందిన అయినవిల్లి కోనసీమ విల్లా రిసార్ట్స్ పురాతన మండువ లోగిళ్ళను సందర్శించారు. హోమ్ స్టే విధానం పర్యాటక రంగంలో స్థానిక ప్రజల జీవన శైలి, ఆచారాలు, సంప్రదాయాలు, వంటకాలు, సాంస్కృతిక వారసత్వాన్ని పర్యాటకులకు ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తుందని ఆయన తెలిపారు. హోమ్ స్టే కోసం అనువైన సనాతన వసతులు ఉన్నది లేనిది ఆయన పరిశీలించారు.