అమలాపురంలో శుక్రవారం నల్సా ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలు, అసంఘటిత కార్మికులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక న్యాయ సేవలు, లీగల్ లిటరసీ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి రమణారెడ్డి మాట్లాడుతూ, చట్టాలు ప్రజా జీవనంలో భాగమై హక్కుల పరిరక్షణ, అవకాశాల అందుపుచ్చుకోవడం, అవసరాలు తీర్చుకోవడంలో ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలు, న్యాయ వ్యవస్థలపై అవగాహన పెంచుకుని మనశ్శాంతిగా, ఆరోగ్యంగా జీవించాలని ఆయన సూచించారు.