అనపర్తి మండలం రామవరంలో ఇందల వీరబాబు, మద్దిపూడి సత్యనారాయణ, భోగాడి వెంకట రమణ, గంగుమళ్ళ వెంకటతలుపులమ్మ, దేవి శ్రీనివాస్ అనపర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఆదివారం రామవరంలో నూతన సభ్యులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించి, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.