రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ శనివారం రాజమండ్రి సిటీలో మాట్లాడుతూ, ఈవీఎంల అక్రమాలు, ఎన్నికల సంఘం అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని ఆరోపించారు. తన పార్టీకి కేటాయించిన 'గాజుగ్లాస్' గుర్తును రద్దు చేయించారని, పవన్ కళ్యాణ్ గెలిచిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన చిత్రాలపై జనసేన పార్టీలోని సామాజిక స్పృహ ఉన్నవారితో బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.