అయినవిల్లి మండలం, అయినవిల్లిలో కొలువైన విగ్నేశ్వర స్వామి వారి ఆలయానికి కార్తీక పౌర్ణమి పర్వదినాన రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. బుధవారం జరిగిన ఈ పుణ్యదినాన, భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 2.71 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు దర్శనార్థం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు.