అయినవిల్లి: పడిపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

గురువారం, పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అయినవిల్లి మండలంలోని వీరవల్లిపాలెం గ్రామంలో పర్యటించారు. తుఫాన్ కారణంగా ముంపునకు గురైన పంటలను పరిశీలించి, బాధితులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శ్రీనివాసరావు, సర్పంచ్ బుచ్చిరాజు, తాహశీల్దార్ విద్యాపతి, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్